ఓటమి భయంతోనే టీఆర్ఎస్ కుట్రలు

లోక్ సభ ఎన్నికల్లో ఓటమి భయంతో టీఆర్ఎస్ పార్టీ కుట్రలకు పాల్పడుతూ, అధికార దుర్వినియోగం చేస్తోందని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం ఆరోపించారు. తమ కార్యకర్తలను వెంబడించేలా పోలీసులనుమఫ్టీలో పంపిస్తోందని మండిపడ్డారు. తమ ప్రచారంపై నిఘాపెట్టిన ఇద్దరు పోలీసులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని విలేకరులకు చెప్పారు. వారిని సస్పెండ్ చేయాలని డీజీపీని, ఎన్నికల కమిషన్ ను కలుస్తామన్నారు. తమ ప్రచారాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలను కారణం లేకుండా పోలీస్టేషన్ల లో గంటల తరబడి ఉంచుతున్నారని ఆరోపించారు.పోలీసులు పార్టీ కోసం కాకుం డా ప్రజల కోసం పని చేయాలని ఆయన సూచించారు. తమ మీటింగ్ లకు ఆలస్యం గా అనుమతిస్తూ, టీఆర్ ఎస్ పార్టీ మీటింగ్ లకైతే త్వరగా పర్మిషన్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లాపై టీఆర్ ఎస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, సా గు, తాగు నీటికి జిల్లా ప్రజలు అల్లాడి పోతున్నా పట్టిం చుకోవడం లేదని ధ్వజమెత్తారు. ‘‘పాలమూరు ఎత్తిపోతల పథకంతోనే ఈప్రాంతంలో నీటి సమస్య తీరుతుం ది. దాన్ని పూర్తిచేసే బాధ్యత మాదే. ఎల్బీ స్టేడి యంలో సీఎం కేసీఆర్ సభ జనంలేక ఫెయిలైంది. ఆ పార్టీపై జనాలకు నమ్మకం పోయిందనడానికి ఇదే నిదర్శనం. కేటీఆర్ మీటింగ్ లో ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు.వారిలో ని రుద్యోగి, రైతు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోటీఆర్ ఎస్ ఓడిపోయిం ది. టీఆర్ ఎస్ పై విద్యావేత్తలు,మేధావులకు నమ్మకం పోయిం ది. ప్రజల్లో కూడా ఆపార్టీపై వ్యతిరేకత ఉంది”అని ఆయన చెప్పారు.

Latest Updates