పోలీసులపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు

సైబరాబాద్ పోలీసులపై బంజారహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఎన్నికల సమయంలో సైబరాబాద్ పోలీసులు తన ఆఫీస్ లోకి కోర్టు అనుమతి లేకుండా అక్రమంగా ప్రవేశించారని ఆరోపించారు. తనతోపాటు తమ సిబ్బంది పై దురుసుగా ప్రవర్తించారని అన్నారు.దీనిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేస్తే.. తానే పోలీసులను  కొట్టానని తనపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. అందుకే మళ్ళీ పిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ కి వచ్చినట్లు చెప్పారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

Latest Updates