కేసీఆర్, కేటీఆర్ అహంకారాన్ని దించుదాం

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అహంకారాన్ని మోకాళ్ళవరకు దించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ముందు నాగులు ఆత్మహత్య చేసుకున్న దుర్గటన టీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అదే టీఆర్ఎస్ నేతలు ఏ మొఖం పెట్టుకుని ఎన్నికలకు వస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నాలాల్లో పడి ప్రజలు చచ్చిపోతే… వర్షం వస్తే నీళ్ళు రాక నిప్పు వస్తదా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎటకారం మాట్లాడిండు. టీఆర్ఎస్ బలం డబ్బు మాత్రమే..ప్రతీ పట్టబద్రుడు కాంగ్రెస్ పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ కు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలని కొండా కోరారు.

Latest Updates