వీడియో: నెలరోజులకే కొండపోచమ్మసాగర్ కాలువకు గండి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత నెల 29న ప్రారంభించిన కొండపోచమ్మసాగర్ కాల్వకు గండి పడింది. సిద్ధిపేట జిల్లా మర్కుక్ శివార్లలో కాల్వకు గండి పడటంతో వెంకటాపురం గ్రామం వరదనీటిలో చిక్కుకుపోయింది. కొండపోచమ్మ సాగర్ నుండి యాదాద్రి జిల్లాకు నీటిని పంపే కుడికాలువకు గండిపడటంతో ఈ ఘటన జరిగింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో కాలువకు గండి పడటంటో గ్రామస్తులంతా అప్రమత్తమయ్యారు. పొలాలు, కూరగాయల తోటలతో పాటు, గ్రామంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఉదయం పూట కావడంతో ప్రమాదం తప్పింది. అదే రాత్రిపూట అయితే ఎంత నష్టం జరిగేదోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు గండి పడిన విషయం గ్రామస్థులు వెంటనే అధికారులకు తెలియజేయడంతో ప్రాజెక్ట్ నుంచి నీటిని నిలిపివేశారు. అయితే ప్రాజెక్టు ప్రారంభించి సరిగ్గా నెల రోజులకే కాలువకు గండి పడటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళన పడుతున్నారు. ముందుముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు.

For More News..

ట్యాక్స్‌ కట్టలేం.. బండ్లు మీ దగ్గరే పెట్టుకోండి

అన్ లాక్ 2 గైడ్ లైన్స్ విడుదల

ఒకరిద్దరు చనిపోతే ఇంత బద్నాం చేస్తరా?

Latest Updates