మర్డర్ మిస్టరీని ఛేదించిన కొండాపూర్ పోలీసులు

కన్నతండ్రే కాలయముడయ్యాడు

హైదరాబాద్: ఆడ పిల్ల పుడితే ఇంటిదీపం పుట్టింది అని సంతోషంతో ఉండాల్సిందిపోయి ద్వేషంతో రగిలిపోయిన ఓ కన్నతండ్రి చివరకు ఆ బాలిక పట్ల కాలయముడయ్యాడు. గుండెల మీద పెంచాల్సినోడే.. కసాయిలా మారి ప్రాణాలు తీశాడు. భార్యకు సైతం తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చంపేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చాడు. ఈనెల 15వ తేదీన మల్కాపూర్ పెద్ద చెరువులో మూడేళ్ల చిన్నారి మరియమ్ కురుబా(3) మృతదేహం దొరికింది. ఆడుతూ.. పాడుతూ ఇంట్లో నిద్రపోయిన తన చిన్నారి.. రాత్రిపూట ఇంట్లో నుంచి చెరువు వరకు ఎలా వెళ్లిందో అర్థం కాక.. తల్లి మెహరాజ్ బేగం కంట తడిపెట్టుకుని విలపించింది.

పోలీసుల ఫిర్యాదు మేరకు కొండాపూర్ పోలీసులు  అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. తండ్రి మస్తాన్  మాట తీరు.. కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో నిఘా పెట్టారు.  పుట్టినప్పటి నుండి అమ్మాయి పట్ల ఏ మాత్రం ప్రేమ చూపేవాడు కాదని తెలిసింది. కొండాపూర్ సీఐ శివలింగం, ఎస్.ఐ రాజులు బాలకి తండ్రి మస్తాన్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. కన్నతండ్రే కసాయి అని తేలింది.  ఈనెల 14వ తేదీన రాత్రి తాను ఆలస్యంగా ఇంటికొస్తానని.. తలుపు తెరచి ఉంచమని చెప్పిన మస్తాన్.. చెప్పినట్లే ఆలస్యంగా వచ్చాడు. భార్య నిద్రపోతుంటే.. ఆమె పక్కనే నిద్రపోతున్న మరియమ్ కురుబా (3)ను ఎత్తుకుని బైకుపై కూర్చొబెట్టుకుని చెరువు దగ్గరకు తీసుకెళ్లి పడేశాడు. ఇంటికి తిరిగొచ్చి ఏమీ తెలియనట్లు నిద్రపోయాడు. తన పక్కన ఉండాల్సిన చిన్నారి లేకపోవడం.. నిద్రపోతున్నప్పుడు లేని భర్త.. చీకట్లో ఆలస్యంగా ఎప్పుడొచ్చాడో తెలియకపోవడంతో భార్య మెహరాజ్ కొంత అయోమయానికి గురైంది. చీకట్లో తెల్లవారుజామున చిన్నారి కోసం చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. చివరకు చెరువులో శవమై కనిపించింది. భర్తపై అనుమానం వచ్చినా.. ఇంత దారుణం చేస్తాడనుకోలేదని కంటతడిపెట్టుకుని విలపించింది.  

Read more news

షుగర్ ఉంటే తేనె వాడొచ్చా..?

కళ్ల ముందే అద్భుతాలు.. త్వరలో అందుబాటులోకి ఏఆర్ టెక్నాలజీ

ఫ్లిప్ కార్ట్ యూజర్లు ఆల్ టైమ్ హై

కరోనా టెస్ట్.. జస్ట్ రూ.850

పేకాటలో టెక్నాలజీ.. తండ్రీ కొడుకుల ఛీటింగ్


Latest Updates