హంపి, హారిక ఓటమి

చెన్నై: ఫిడే వుమెన్స్‌ స్పీడ్‌ చెస్‌‌ చాంపియన్‌షిప్‌ గ్రాండ్‌ప్రి టోర్నీలో.. ఇండియా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో వరల్డ్‌ రెండో ర్యాంకర్‌, ఇండియా గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి2–9తో అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (రష్యా) చేతిలో ఓడింది. తర్వాతి గేమ్‌‌లో వరల్డ్‌ టాప్‌ ర్యాంకర్‌ హుయిఫాన్‌ (చైనా) 7–3తో గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారికపై విజయం సాధించింది. ఈ రెండు ఓటములతో ఇండియా తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించలేకపోయింది. కొస్టెనిక్‌తో జరిగే గేమ్‌‌లో హంపి అన్ని రంగాల్లో విఫలమైంది. ఎండ్‌ గేమ్‌‌లో సరైన ఎత్తులు వేయకపోవడంతో కొస్టెనిక్‌ ఓ ఆటాడుకుంది. హారిక గేమ్‌‌ ఆరంభంలో గట్టిపోటీ ఇచ్చినా.. చివర్లో యిఫాన్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోయింది. ఈనెల 15 నుంచి జరిగే నాలుగో అంచె పోటీల్లో హంపి, హారిక బరిలోకి దిగనున్నారు. నాలుగు అంచెలుగా సాగే ఈ టోర్నీలో హయ్యెస్ట్‌‌ పాయింట్లు సాధించిన ఇద్దరు ప్లేయర్ల మధ్య సూపర్‌ ఫైనల్‌‌ ఉంటుంది.

Latest Updates