కెయిన్స్ క్వీన్ హంపి

సెయింట్‌‌‌‌ లూయిస్‌‌‌‌ :  పెళ్లి చేసుకొని, బిడ్డకు జన్మనిచ్చి రెండేళ్ల విరామం తర్వాత రీ ఎంట్రీలో అసాధారణ ఆటతీరుతో దూసుకెళ్తున్న ఇండియా చెస్‌‌ క్వీన్‌‌ కోనేరు హంపి మరోసారి మాయ చేసింది.  మహిళా చెస్‌‌ హిస్టరీలోనే  స్ట్రాంగెస్ట్‌‌ టోర్నమెంట్‌‌ అయిన కెయిన్స్‌‌ కప్‌‌లో టైటిల్‌‌తో మెరిసింది. వరల్డ్‌‌ చాంపియన్‌‌ సహా తొమ్మిది మంది గ్రాండ్‌‌మాస్టర్లు, ఓ మహిళా గ్రాండ్‌‌మాస్టర్‌‌ బరిలో నిలిచిన టోర్నీలో అలవోకగా ట్రోఫీ నెగ్గిన తెలుగు కెరటం బోనస్‌‌గా ప్రపంచ రెండో ర్యాంక్‌‌కు చేరుకొని అదరహో అనిపించింది. వరల్డ్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ విజయం గాలివాటం కాదని నిరూపించింది. ద్రోణవల్లి హారికతో  సోమవారం జరిగిన చివరి, తొమ్మిదో రౌండ్‌‌‌‌లో బ్లాక్‌‌‌‌ పీసెస్‌‌‌‌తో ఆడిన హంపి 29 ఎత్తుల వద్ద గేమ్​ను డ్రాగా ముగించింది. ఓవరాల్‌‌‌‌గా ఆరు పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌తో ట్రోఫీ గెలిచింది.   అంతేకాక ఐదు ఎలో రేటింగ్‌‌‌‌ పాయింట్లు కూడా దక్కించుకోవడంతో  వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ 2 స్థానానికి చేరింది. వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ వెన్‌‌‌‌జున్‌‌‌‌ జు(చైనా) 5.5 పాయింట్లతో రన్నరప్​గా నిలవగా,  ఉక్రెయిన్‌‌‌‌కు చెందిన మరియా ముజుచుక్‌‌‌‌(5 పాయింట్లు) మూడో ప్లేస్‌‌‌‌ సాధించింది. హారిక 4.5 పాయింట్లతో టోర్నీని ఐదో ప్లేస్‌‌‌‌లో ముగించింది. కాగా, ఈ టోర్నీలో టైటిల్‌‌‌‌ నెగ్గే క్రమంలో ఎదురైన సవాళ్లను హంపి సమర్థవంతంగా అధిగమించింది.  16 ఏళ్ల యంగ్‌‌‌‌ టాలెంట్‌‌‌‌ కారిసా యిప్‌‌‌‌ (అమెరికా)ను ఓడించి టోర్నీని స్టార్ట్​ చేసిన తెలుగు ప్లేయర్‌‌‌‌కు సెకండ్‌‌‌‌  రౌండ్‌‌‌‌లో ముజుచిక్‌‌‌‌ షాకిచ్చింది. అయితే, ఏ మాత్రం వెనుకంజ వేయని హంపి గొప్పగా పుంజుకుంది. తర్వాతి ఏడు రౌండ్లలో ఓటమే లేకుండా మరో ఐదు పాయింట్లు గెలిచింది. ఎనిమిదో రౌండ్‌‌‌‌లో వాలెంటినా గునియాపై  అద్భుత విజయంతో  ఫైనల్‌‌‌‌ రౌండ్‌‌‌‌కు ముందే ఒంటరిగా టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లోకి వచ్చింది. చివరి రౌండ్​లో హారికతో ఈజీ డ్రాతో టైటిల్​ నెగ్గింది.

ఇంత కఠినమైన టోర్నీ గెలవడం చాలా ఆనందంగా ఉంది. దీంతో వరల్డ్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ విజయం గాలివాటం కాదని తేలింది. ఈ టోర్నీలో అలెగ్జాండ్రాతో సుదీర్ఘంగా సాగిన ఏడో రౌండ్‌‌‌‌ గేమ్‌‌‌‌ చాలా టఫ్‌‌‌‌ ఫైట్‌‌‌‌. ఆ గేమ్​ డ్రా చేసుకోవడంతో ఆమె చేతిలో ఓటమెరుగని రికార్డు మెరుగైంది. ఎనిమిదో రౌండ్‌‌‌‌  దాకా టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ కోసం హోరాహోరీ పోటీ నడిచింది. ఐదు ఎలో పాయింట్స్‌‌‌‌ రావడంతో వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ 2కు చేరా. అందువల్ల ఏదో ఒక రోజు వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌గా నిలవాలనే లక్ష్యాన్ని మార్చుకోవడం లేదు. మే నెలలో ఇటలీ వేదికగా జరిగే గ్రాండ్‌‌‌‌ ప్రి నా తదుపరి లక్ష్యం. తర్వాత స్వదేశంలో జరిగే పీఎస్‌‌‌‌పీబీ టోర్నీల్లో ఆడతా. ఫిడే మహిళల గ్రాండ్‌‌‌‌ ప్రి సిరీస్‌‌‌‌లో ప్రస్తుతం లీడింగ్‌‌‌‌లో ఉన్నా. త్వరలో జరిగే గ్రాండ్‌‌‌‌ ప్రీకి అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.

– హంపి

Latest Updates