నేటి నుంచి కొరియన్ ఫిలిం ఫెస్టివల్

హైదరాబాద్, వెలుగు: ఇండియా, కొరియా దేశాలు ఆగష్టు15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆగస్టు 12 సోమవారం నుంచి 16 శుక్రవారం వరకు  కొరియన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.   భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో  రవీంద్ర భారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిలిం ఫెస్టివల్ ఇంటర్నేషనల్ లో భాగంగా ఈ ఫెస్టివల్​ నిర్వహిస్తున్నట్లు  సంచాలకులు మామిడి హరికృష్ణ ఆదివారం తెలిపారు.  ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఫిలిం ఫెస్టివల్ లో 12న ‘ది అడ్మిరల్: రోరింగ్ కరెంట్స్’ 13న ‘టాక్సీ డ్రైవర్, 14న ‘బర్న్ ది స్టేజ్: ది మూవీ’, 15న ‘బిటీఎస్ వరల్డ్ టూర్: లవ్ యువర్ సెల్ఫ్ ఇన్  సియోల్‌’, 16న ‘వెటరన్’ (2015) సినిమాలు ప్రదర్శిస్తామన్నారు.

Latest Updates