ఎస్సారెస్పీ కాలువలో ఎమ్మెల్యే పీఏ గల్లంతు

జగిత్యాల క్రైం, వెలుగు: ఎస్సారెస్పీ కాలువలో పడి ఎమ్మెల్యే పీఏ గల్లం తయ్యారు . జగిత్యాల పట్టణానికి చెందిన గిరీష్ సింగ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగి . ప్రస్తుతం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పీఏగా విధులు నిర్వహిస్తున్నారు. జగిత్యాలకు చెందిన ముగ్గురు మిత్రులతో కలిసి ఆదివారంవిందు చేసుకున్నారు. తిరిగి వస్తుండగా లింగంపేట అంతర్గాం బైపాస్ రోడ్డులోని ఎస్సారెస్పీ కెనాల్ లో ప్రమాదవశాత్తు పడిపోయినట్లు సమాచారం. విషయం తెలియడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

Latest Updates