అయోధ్య రామాలయం పేరుతో బిచ్చమెత్తు కుంటున్నారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

korutla-mla-vidyasagar-rao-made-controversial-comments-on-the-construction-of-ayodhya-rama-mandir

అయోధ్య రామ మందిర్ నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. అయోధ్యలో నిర్మించే రామాలయానికి చందాలివ్వొద్దని చెప్పారు.  బీజేపీ నేతలు అయోధ్య రామాలయం పేరుతో బిచ్చమెత్తు కుంటున్నారన్నారు. జగిత్యాలలో జరిగిన రెండో విడత గొర్రెల పంపిణీ సభలో ఈ విధంగా మాట్లాడారు. మన గ్రామాల్లో రాముడు లేడా… ఉత్తర ప్రదేశ్ లో రామాలయానికి చందాలెందుకు ఇవ్వాలని కామెంట్ చేశారు. బొట్టుపెట్టుకుంటేనే రామభక్తులా..  తాము కూడా శ్రీరాముని భక్తులమే అన్నారు ఎమ్మెల్యే విద్యాసాగర్.

Latest Updates