
టేకులపల్లి, వెలుగు: ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ భర్త హరిసింగ్ నాయక్తనను వేధిస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిస్ట్రిక్ట్కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(డీసీసీబీ) డైరెక్టర్, బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ ఆరోపించారు. కోల్టెండర్ వేసేందుకు టేకులపల్లి నుంచి కొత్తగూడెం వెళ్తున్న ఆయనను పాత కేసుల విచారణ అంటూ పోలీస్‌లు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌వద్ద సురేందర్ విలేకరులతో మాట్లాడారు. తాను చెప్పినట్టే వినాలంటూ కొన్ని రోజులుగా ఎమ్మెల్యే భర్త హరిసింగ్మానసికంగా, ఆర్థికంగా వేస్తున్నారని చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ మూడు రోజులుగా డీఎస్సీ, సీఐ ఆఫీసుల నుంచి పిలుస్తున్నారని అన్నారు. కోయగూడెం కోల్టెండర్ వేసేందుకు బయలుదేరిన తనను కావాలని పాత కేసుల పేరుతో స్టేషన్‌కు తీసుకొచ్చారన్నారు. కేసుల పేరుతో ఎమ్మెల్యే భర్త తనను కొద్ది రోజులుగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీ ఓనర్స్‌తో పాటు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులను ఆయన బెదిరిస్తున్నారని ఆరోపించారు. కోయగూడెం ఓపెన్‌కాస్ట్‌లో పనిచేసే ఆఫీసర్లతో పాటు కాంట్రాక్టర్లను ఆయన చెప్పినట్టే వినాలని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. పాత కేసులో భాగంగానే విచారణ కోసం సురేందర్‌ను స్టేషన్‌కు పిలిపించామని ఎస్సై రాజ్కుమార్పేర్కొన్నారు.