కొవిడ్-19: అందుబాటులో ఉన్న కరోనా వైరస్ బెస్ట్ పాలసీలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భారతదేశంలో అదే  పరిస్థతి. ప్రస్తుతం దేశంలో 51,18,253 నమోదు కాగా, 83,198 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షలు. కేవలం భారతదేశం మాత్రమే కాదు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలో, ఇటలీలోనూ కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇటువంటి సమయంలో కరోనా వైరస్ చికిత్సకు కవరేజీ అందించే ఆరోగ్య బీమాను కలిగి ఉండటం అనేది అత్యావసరం. కరోనా వైరస్- ఆరోగ్య బీమా పథకాలు కరోనా వైరస్ చికిత్సకు కవరేజీ అందించేందుకు బీమా సంస్థలు పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చాయి.

ఇతర ఆరోగ్య బీమా పథకాల మాదిరిగానే ఈ పాలసీలు కూడా హాస్పిటలైజేషన్ ఖర్చులకు కవరేజీ అందిస్తాయి. అలాగే ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, అవుట్ పేషంట్ ఖర్చులు, మందుల ఖర్చులు వంటి సమగ్ర కవరేజీని ఈ కరోనా వైరస్ ఆరోగ్య బీమా పాలసీలు అందిస్తాయి. ఇక్కడ గమనించాల్సిన మరొక  విషయం ఏమిటంటే కొవిడ్-19 ఆరోగ్య బీమా పథకాలు పిపిఈ కిట్ ల ఖర్చుకు కూడా కవరేజీ అందిస్తాయి. “ఆరోగ్య బీమా పథకాలు కొవిడ్-19 చికిత్సకు కవరేజీని అందిస్తాయి. అయితే కరోనా కవచ్ మరియు కరోనా రక్షక్ పాలసీలు ప్రత్యేకంగా కొవిడ్-19 కోసం రూపందించబడ్డాయి. ఇవి పిపిఈ కిట్స్, మాస్కులు, బ్లౌజుల ఖర్చుతో పాటు, హం ఐసోలేషన్, డయోగ్నస్టిక్ ఖర్చు లకు కూడా కవరేజీ అందిస్తాయని” చెబుతున్నారు policyX.com సీఈవో నవల్ గోయల్.

అందుబాటులో ఉన్న కరోనా వైరస్ పాలసీలు

ఐఆర్డీఏఐ మార్గనిర్దేశకాల మేరకు ప్రత్యేకంగా కొవిడ్-19 కోసం బీమా సంస్థలు రండు రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అవి, 1.కరోనా కవచ్

 2.కరోనా రక్షక్

ఈ రండు పాలసీలు కూడా స్టాండర్డ్ కొవిడ్-19 పాలసీలు. ఈ పాలసీల యొక్క నిబంధనలు ఇతర ఆరోగ్య బీమా రథకాల నిబంధనలను పోలి ఉంటాయి. ఈ పాలసీల గురించి తెలుసుకుందం..

1.కరోనా కవచ్ బీమా పాలసీ

కరోనా కవచ్ అనేది స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీ కింద హాస్పిటలైజేషన్ ఖర్చులు , హోం ఐసోలేషన్ ఖర్చులు , అంబులెన్స ఖర్చులు, పిపిఈ కిట్ ఖర్చులు , మందుల ఖర్చులు, మాస్కులు, గ్లౌజులు, ఐసీయూ ఖర్చులకు కవరేజీ లభిస్తుంది. ఈ పథకం బీమా మొత్తం రూ. 50,000 దగ్గర నుంచి ప్రారంభమవుతుంది.  మరియు గరిష్టంగా రూ. 5 లక్షల వరకు కవరేజీ పొందవచ్చు. ఈ పథకం కుటుంబ సభ్యులకు కూడా రక్షణ కల్పించవచ్చు. అలాగే ఆయుష్ చికిత్స విధానాలకు కూడా ఈ పథకం కవరేజీ అందిస్తుంది.  ఈ పాలసీ కింద ఆప్షనల్ కవర్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది. కొవిడ్-19 చికిత్స  కోసం పాలసీదారుడు 24 గంటల కంటే ఎక్కువ సేపు ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రి నగదు ప్రయోజనం కింద బీమా మొత్తంలో 0.5 శాతం రోజు వారి నగదు కింద అందించబడుతుంది. ఇది గరిష్టంగా 15 రోజుల వరకు చెల్లించబడుతుంది. “ఇప్పటికే ఆరోగ్య బీమా కలిగి ఉండి మరియు ఆరోగ్య బీమా మొత్తం తక్కువగా  ఉన్నట్జుయితే కరోనా కవచ్ పాలసీని ఎంచుకోవచ్చు. ఈ కరోనా కవచ్ పాలసీ కింద సమగ్ర కవరేజీ లభిస్తుంది. ఇప్పటి వరకు ఆరోగ్య కలిగి ఉండకపోతే, కరోనా కవచ్ పాలసీని కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే కరోనా కవచ్ పాలసీ కింద మొత్తం కుటుంబానికి రక్షణ కల్పించవచ్చు.

 2.కరోనా రక్షక్ పాలసీ

కరోనా రక్షక్ పాలసీ, పాలసీదరుడు కొవిడ్-19 చికిత్స  కోసం 72 గంటల కన్నా ఎక్కువ  సేపు ఆసుపత్రిలో ఉన్నట్లైతే , బీమా మొత్తం ఒకేసారి అందించబడుతుంది. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. అలాగే బీమా మొత్తం కనిష్టంగా  రూ.50 వేల నుంచి, గరిష్టంగా 2.5 లక్షలు వరకు ఎంచ్చు కోవచ్చు. “ఆరోగ్య బీమా కలిగి ఉండి మరియుకొవిడ్-19 కారణంగా రోజులవారీ ఆదాయానికి కోల్పోతే కరోనా రక్షక్ పాలసీని ఎంచుకోవడం మంచిది. పాలసీదారునికి కొవిడ్-19 నిర్థారణ అయితే, ఈ పాలసీ కింద ఒకే సారి బీమా మొత్తం చెల్లించబడుతంది. ఈ పాలసీ వ్యక్తిగతంగా మాత్రమే కవరేజీ అందిస్తుంది.  కుటుంబ ఫ్లోటర్   విధానం అందుబాటులో లేదు.

కరోనా కవచ్ మరియు కరోనా రక్షక్ పాలసీల మధ్య తేడాలు ఫీచర్లు

పాలసీ ప్రీమియం రేట్లలలో తేడాలు..

 

కరోనా కవచ్ మరియు కరోనా రక్షక్ ప్రీమియం రేట్లు భిన్నంగా ఉంటాయి. రెండు రకాల పాలసీలు ప్రామాణిక ఉత్పత్తులు అయినప్పటికీ, పాలసీ ప్రీమియం అనేది బీమా సంస్థ నుంచి బీమా సంస్థకు మారుతూ ఉంటుంది. బీమా సంస్థలకు పాలసీ ధరను నిర్ణయించడానికి అనుమతి ఉంది.

“క్లెయిమ్  నిష్పత్తులు మొదలైన్ వాటి అంచనాల ఆధారంగా బీమా సంస్థలు ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి. ప్రతి బీమా సంస్థ యొక్క యాక్చురియల్ బృందం యొక్క అంచనాలు వేరువేరుగా ఉంటాయి. అందువల్లే ప్రీమియం  రేట్లు భిన్నంగా ఉంటాయి. అలాగే బీమా సంస్థలు అందించే సేవల నాణ్యతలను బట్టి కూడా ధర భిన్నంగా ఉంటుంది.”

ఇతర రకాల కొవిడ్-19 బీమా పథకాలు

కరోనా కవచ్ మరియు కరోనా రక్షక్ పాలసీలు మాత్రమే కాకుండా, చాలా బీమా సంస్థలు ఇతర పాలసీలను కూడా ప్రారంభించాయి. ఇవి నీడ్-బేస్డ్ పాలసీలు. ఐఆర్డఏ ఐ శాండ్ బాక్స్ నిబంధనల ప్రకారం బీమా సంస్థలు పరమిత కాలానికి  ఈ పాలసీలను విక్రయించడానికి అనుమతి ఉంది. ఈ పాలసీలు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష కవరేజీ అందిస్తాయి. ఉదహరణకు స్టాల్ నావల్ కరోనా వైరస్ ఇన్సూరెన్స పాలసీ, ఇది రూ. 21,000 మరియు రూ. 42 వేల విలువ కలిగిన రండు బీమా ఎంపికలను అందిస్తుంది. కరోనా రక్షక్ మరియు కరోనా కవచ్ కవరేజీ అందించే అంశాలు కరోనా కవచ్ మరియు కరోనా రక్షక్ రెండూ కూడా భిన్నమైన పాలసీలు. ఈ పాలసీలు విభిన్న అంశాలకు కవరేజీ అందిస్తాయి. కరోనా రక్షక్, కరోనా కవచ్ అందించే ప్రాథమిక కవరేజీ అంశాలు కింద పట్టికలో ఉన్నాయి.

కొవిడ్-19 హాస్పిటలైజేషన్ ఖర్చులు

  1. ఆసుపత్రి గది అద్దే, బోరింగ్ మరియు నర్సింగ్ ఛార్జీలు.
  2. కన్సల్టెంట్, స్పోషలిస్ట్, సర్జన్ ఖర్చులు
  3. రక్తం, ఆక్సీ జన్, ఆరరేషన్ థియేటర్, శస్త్ర చికిత్స పరరికరాలు, వెంటిలేటర్, మందుల ఖర్చులు
  4. డయాగ్నోస్టిక్స్ , పిపిఈ కిట్స్, మాస్కులు, గ్లౌజులు మరియు ఇతర అనుబంధ ఖర్చులు
  5. ఐసీయూ ఖర్చులు
  6. అంబులెన్స్ ఖర్చులు (గ్రరిష్టంగా రూ. 2000)

 హోంకేర్ ఐసోలేషన్ ఖర్చులు

  1. గరిష్టంగా 14 రోజుల వరకు అయ్యే ఖర్చులకు కవరేజీ అందించబడుతుంది.
  2. వైద్యునిచే సూచించబడిన మందుల ఖర్చులు (ప్రస్కిప్షన్ )
  3. ఇంటి వద్ద లేదా డయాగ్నోస్టిక్ సెంటర్ లొ నిర్వహించే ఖర్చులు.
  4. కన్సల్టేషన్ ఛార్డలు.
  5. నర్సింగ్ ఛార్జీలు
  6. ఆక్సీజన్ సిలిండర్, ఆక్సోమీటర్ మరియు నెబ్యూలైజర్ ఖర్చులు.
  7. ఆయుష్ చికిత్స, ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు కూడా పాలసీ కవరేజీ అందిస్తుంది.

కరోనా రక్షక్ కవరేజీ

  • పాలసీదరుడు కొవిడ్-19 పాజిటివ్ నిర్దారణ అయితే పాలసీ మొత్తం 100 శాతం చెలించబడుతుంది. అయితే 72 గంటలు హాస్పిటలైజేషన్ అయి ఉండాలి.
  • కొవిడే-19 కింద ఆసుపత్రిలో చేరినప్పుడు ఆసుపత్రి ఖర్చులతో సంబంధం లేకుండా పాలసీ మొత్తం చెలించబడుతుంది.

కరోనా కవచ్& కరోనా రక్షక్ పాలసీల యొక్క ప్రయోజనాలు

  • పిపిఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు, ఆక్సీజన్, వెంటిలేటర్ మరియు డయాగ్నోస్టిక్ ఖర్చులకు కరోనా కవచ్ పాలసీ కింద సమగ్ర కవరేజీ లభిస్తుంది.
  • కరోనా కవచ్ పాలసీ కింద ఐసీయూ చికిత్సకు పూర్తి కవరేజీ లభిస్తుంది.
  • అంబులెన్స ఛార్డలు గరిష్టంగా రూ. 2000 వరకు అందించబడతాయి.
  • నర్సింగ్ , ఆసుపత్రి గది అద్దేకు కవరేజీ లభిస్తుంది.
  • 14 రోజుల పాటు హోం ఐసోలేషన్ కు కవరేజీ లభిస్తుంది.
  • ఆయుష్ చికిత్స విధానానికి కూడా కవరేజీ అందుబాటులో ఉంది.
  • ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ కు కవరేజీ.
  • కరోనా కవచ్ పాలసీ కింద ఐచ్చిక కవర్ ను ఎంపిక చేసుకున్నట్లయితే , రోజువారి ఆసుపత్రి నగదు కింద బీమా మొత్తంలో 0.5 శాతం లభిస్తుంది.

“పాలసీ కొనుగోలు చేసే మందు, పాలసీ యొక్క కవరేజీ, వెయిటింగ్ పిరియడ్ పరిశీలించాలి. అలాగే వినియోగదారుడు తమ అవసరాలను బేరీజు వేసుకుని బీమా మొత్తాన్ని ఎంచుకోవాలి. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని పాలసీ కొనుగోలు చేస్తే తక్కువ ప్రీమియంలోనే సమగ్ర కవరేజీ అందించే పాలసీని వినియోగదారుడు ఎంచుకోవచ్చు.”

 కొవిడ్-19 బీమా కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

బీమా మొత్తం- కరోనా కవచ్ కింద లభించే గరిష్ట బీమా మొత్తం రూ. 5 లక్షలు కాగా, కరోనా రక్షక్ పాలసీ  కింద లభించే గరిష్ట బీమా మొత్తం రూ. 2.5 లక్షలు. ఈ పాలసీలు ఇంతకంటే ఎక్కువ కవరేజీ అందించవు.

కవరేజీ- పాలసీ కొనుగోలు చేసే మందు, పాలసీ అందించే కవరేజీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి.  అలాగే అవసరాలకు అనుగుణంగా ఉత్తమ పాలసీని ఎంచుకోవాలి.

వెయిటింగ్ పిరియడ్- చాలా ఆరోగ్య బీమా పథకాలు మందుగా ఉన్నవ్యాధులకు వెయిటింగ్ పిరియడ్ పూర్తి అయిన తర్వాత మాత్రమే కవరేజీని అందిస్తాయి. ఈ వెయిటింగ్ గరిష్టంగా 48 నెలల వరకు ఉంటుంది. కొవిడ్-19 పాలసీలకు కూడా 15 రోజుల వెయిటింగ్ పిరియడ్ ఉంది.

గుర్తింపు పొందని డయాగ్నోస్టక్ సెంటర్- పాలసీదరుడు కొవిడ్-19 పరీక్షను గుర్తింపు పొందిని డయాగ్నోస్టిక్  సెంటర్ ద్వారా నిర్వహించబడితే పాలసీలు ఎటువంటి కవరేజీ అందించవు.

క్లైమ్ వెయిటింగ్ పిరియడ్- ఒక వేళ పాలసీ కొనుగోలు చేసిన 15 రోజుల లోపు క్లైమ్ ధాఖలు చేస్తే, క్లైమ్   తిరస్కరణకు గురవుతుంది.

హోం క్వారంటైన్ ఖర్చులు-హోం క్వారంటైన్ ఖర్చులకు పాలసీ ఎలాంటి కవరేజీ అందించదు.

ముందుగా ఉన్న వ్యాధులకు కవరేజీ- ముందుగా ఉన్న వ్యాధుల చికిత్స కోసం వెయిటింగ్ పిరియడ్ ముగియకపోతే పాలసీ ఎలాంటి కవరేజీ అందించదు.

వైద్యుడి రిఫరల్ లేకుండా ఆస్పత్రిలో చేరడం- గుర్తింపు పొందిన వైద్యుని రిఫరల్ లేకుండా మీరు ఆసుపత్రిలో చేరితే, ఈ పాలసీ ఆసుపత్రి ఖర్చులకు కవరేజీ అందించదు.

 కరోనా కవచ్, కరోనా రక్షక్ మరియు కొవిడ్- 19 పాలసీల మధ్య వ్యత్యాసం

  • కరోనా కవచ్ మరియు కరోనా రక్షక్ పాలసీలు అన్ని బీమా సంస్థలు ఒకే పాలసీ వ్యవధిని కలిగి ఉంటాయి. ఇతర కరోనా వైరస్ పాలసీల కాల వ్యవధి సంస్థ నుంచి సంస్థకు మారుతూ ఉంటుంది.
  • కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీ నిర్థిష్ట కాలానికి జారీ చేయబడతాయి, ఇతర కరోనా వైరస్(నీడ్ బేస్డ్) పాలసీలను బీమా సంస్థలు ఎప్పుడైనా ఉపసంహరించ్చుకోవచ్చు.
  • కరోనా కవచ్ మరియు రక్షక్ పాలసీలో గరిష్ట , కనిష్ట బీమా మొత్తాలు ఫిక్స్ అయి ఉంటాయి. మిగతా  కరోనా వైరస్ పాలసీలోల ఇది బీమా సంస్థను బట్టి మారుతూ ఉంటుంది.

Latest Updates