కోవిడ్ గుట్టు తెలిసింది

వైరస్ తొలి దశ లక్షణాలు గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా 80 వేల మందికి సోకి.. 3 వేల మందిని పొట్టనపెట్టుకుని.. ఇంకా అనేక దేశాలకు వ్యాపిస్తున్న  చైనీస్ కరోనా వైరస్ గుట్టును సైంటిస్టులు విప్పారు. ఇటీవల ఇద్దరు పేషెంట్లకు ఊపిరితిత్తులకు ఆపరేషన్ చేశారు. వారికి కోవిడ్ (కరోనా వైరస్ డిసీజ్)–19 వచ్చినట్లు తేలింది. ‘‘ఆ ఇద్దరు పేషెంట్ల ఊపిరితిత్తులు వాచిపోయాయి. ప్రొటీన్లతో కూడిన లిక్విడ్స్ ఊరాయి. కణజాలం అక్కడక్కడా కోతకు గురైంది. ప్యాచ్ లు ప్యాచ్ లుగా ఉబ్బిపోయాయి. మోనోసైట్ అనే కణాలు కలిసిపోయి పెద్ద పెద్ద కణాలు ఏర్పడ్డాయి.”అని తాము గుర్తించినట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​షికాగో సైంటిస్టులు వెల్లడించారు. “కోవిడ్ –19 న్యూమోనియా (సార్స్ కరోనావైరస్–2 అని కూడా అంటారు) విషయంలో ఇప్పటివరకూ అటాప్సీ(శవ పరీక్ష), బయాప్సీ వంటివి చేయలేదు. కోవిడ్ రోగానికి సంబంధించి కణజాల స్థాయిలో జరిగిన మొదటి రీసెర్చ్ ఇదే కావచ్చు” అని వర్సిటీ రీసెర్చర్ షు యువాన్ జియావో చెప్పారు. అనుకోకుండానే తాము కోవిడ్ కు సంబంధించిన మొదటి దశ ప్యాథాలజీని గుర్తించామన్నారు. అయితే ఈ వ్యాధిలో తర్వాత దశ, ఫైనల్ ఫేజ్ లో ఎలాంటి మార్పులు జరుగుతాయన్నది అటాప్సీ(శవపరీక్ష)ల ద్వారానే తేలుతుందన్నారు. వీరిద్దరు పేషెంట్లకూ ఆపరేషన్ సమయంలో న్యూమోనియా లక్షణాలేవీ లేవని, ఆపరేషన్ చేశాకే కోవిడ్–19 న్యూమోనియా బయటపడిందన్నారు. అంటే.. వీరికి కోవిడ్–19 న్యూమోనియా తొలిదశలో ఉన్నట్లు భావించవచ్చన్నారు.

Latest Updates