టెన్త్ మెమోల్లో ‘కొవిడ్ ఎఫెక్ట్’

బడులు మొదలయ్యాకే లాంగ్​ మెమోలు

చిన్నమెమోల్లో తప్పుల సవరణకు నెల టైం

హైదరాబాద్, వెలుగు: టెన్త్ లాంగ్మెమోలు బడులు మొదలయ్యాకే స్టూడెంట్లకు అందనున్నాయి. ఏటా సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షలయ్యాక వాటిని ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరీక్షలు లేవు కాబట్టి.. బళ్లు ఓపెన్ చేశాకే ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. సెక్యూరిటీ ఫీచర్స్నూ మెమోల్లో చేర్చాల్సి ఉంటుంది కాబట్టి.. కాస్తంత ఆలస్యమవుతుందని చెబుతున్నారు. ఇక ఆ మెమోల్లో ఈసారి ‘కొవిడ్ ఎఫెక్ట్’ అని కూడా కనిపించనుంది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగానే పదో తరగతి స్టూడెంట్లను సర్కార్ పాస్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మార్కుల ఆధారంగానే గ్రేడింగ్ ఇవ్వాలని ఆదేశిస్తూ ఇచ్చిన జీవో నెంబర్10 గురించి కూడా టెన్త్ మెమోల్లో పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 2014లో గ్రేడింగ్స్పై ఇచ్చిన జీవో 17, జీవో 2లనూ మెమోల్లో మెన్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

చిన్న మెమోల డౌన్లోడ్ మరో వారంలో పూర్తి

టెన్త్ రిజల్ట్స్పై ఇప్పటికే చిన్న (ఇంటర్నెట్) మెమోలను అధికారులు వెబ్సైట్లో పెట్టారు. ఇప్పుడిప్పుడే స్కూళ్లు వాటిని డౌన్లోడ్ చేసి స్టూడెంట్లకు ఇస్తున్నాయి. 11 వేల స్కూళ్లకు చెందిన స్టూడెంట్ల మెమోలను పరీక్షల విభాగం వెబ్సైట్లో పెట్టగా 8 వేల స్కూళ్లు వాటిని డౌన్లోడ్ చేసుకున్నాయి. మరో వారంలో ఆ ప్రక్రియ పూర్తి కానుంది. స్టూడెంట్లు వాటిని చూసుకుని  తప్పులుంటే సరిదిద్దుకునేందుకు అధికారులు అవకాశం ఇస్తున్నారు. పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను సరిచూసుకుని, తప్పులుంటే స్కూల్ హెడ్మాస్టర్లకు చెప్పాలని అధికారులు సూచిస్తున్నారు. తప్పొప్పుల సవరణకు నెల టైం ఇవ్వనున్నట్టు చెప్పారు. కరోనా ఎఫెక్ట్తో రాష్ట్రంలో టెన్త్లో 3 పేపర్లకే పరీక్షలు పెట్టారు. 8 పేపర్లకు వాయిదా పడ్డాయి. కరోనా తగ్గకపోవడంతో పరీక్షలు రద్దు చేసి ఇంటర్నల్ మార్కుల లెక్కన స్టూడెంట్స్ అందర్నీ పాస్ చేయాలని సర్కారు ఆదేశించింది. పరీక్షలకు అప్లై చేసిన 5 లక్షల 34 వేల 903 మందిలో ఎస్ఎస్సీ బోర్డు గ్రేడ్స్ ఇచ్చింది. ఈ ఏడాది లక్షా 41 వేల 383 మంది స్టూడెంట్లకు టెన్ జీపీఏ వచ్చింది. అందులో 97,372 మంది ప్రైవేట్ స్టూడెంట్స్, 26,555 మంది గవర్నమెంట్, జెడ్పీ స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు.

 

Latest Updates