ఘోరం : ఓ అమ్మాయి.. ఇద్దరు స్నేహితులు… హత్య

హైదరాబాద్ కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ ఏరియాలో ఆగస్ట్ 28న జరిగిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మర్డర్ మిస్టరీని మాదాపూర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వేంకటేశ్వరరావు మీడియాకు వివరించారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సతీష్ ను హత్యచేసిన నిందితుడు, అతడి ఫ్రెండ్ హేమంత్ ను అరెస్ట్ చేసి మీడియాకు చూపించారు.

ఆగస్ట్ 28 నుంచి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సతీష్ కనిపించలేదు. దీంతో అతడి స్నేహితురాలు 29న పోలీసులకు మిస్సింగ్ కంప్లయింట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో సతీష్ స్నేహితుడు హేమంత్ పై పోలీసులకు డౌట్ వచ్చింది. హేమంత్ ఇంటికి తాళం వేసి ఉంది. అతడు ఆ సమయానికి పరారీలో ఉన్నాడు. తాళం పగలకొట్టి ఇంట్లోకు వెళ్లి చూస్తే.. లోపల సతీష్ డెడ్ బాడీ కనిపించింది.

ఇదీ ఫ్లాష్ బ్యాక్..

సతీష్, హేమంత్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. సతీష్ 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి, సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ లో కోచింగ్ ఇస్తున్నాడు. మరో ఐటీ కంపనీని కూడా సతీష్.. పార్ట్ నర్స్ తో కలిసి నిర్వహిస్తున్నాడు. మరో ఐటీ కంపనీలో హేమంత్ కూడా సతీష్ తో కలిసి పెట్టుబడి పెట్టాడు. సతీష్ ను హత్య చేసి, యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని హేమంత్ చూశాడు. అందుకోసం ఓ కారును ఎంగేజ్ చేసుకున్నాడు. బాడీని ఒక్కడే మోయలేక అక్కడే ఇంట్లో డెడ్ బాడీని వదిలి వెళ్ళాడు. కర్ణాటకకి పరారయ్యాడు.

ఎందుకు స్నేహితుడినే చంపేశాడు..?

కేసులో సతీష్ స్నేహితురాలి వ్యవహార శైలిపై సందేహాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. హేమంత్, సతీష్ గాళ్ ఫ్రెండ్ ఫోన్ కాన్వర్జేషన్ లో కొన్ని మెసేజ్ లు డిలీట్ చేశారనీ.. వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు.

2016లో ఓ కోచింగ్ సెంటర్ లో ఫ్యాకల్టీ సతీష్ కు.. స్టూడెంట్ గా ఆమె పరిచయమైంది. ఆ తరువాత సతీష్ తన కంపనీలో ఆమెకు ఉద్యోగం ఇచ్చాడు. KpHB లో ఉన్న ఐటీ కంపనీకి ఆమెను ట్రాన్స్ ఫర్ అయింది. ఈ క్రమంలోనే… సతీష్ ఫ్రెండ్ హేమంత్ తో … ఆమెకు పరిచయం ఏర్పడింది. తరువాత kphb 7th ఫేజ్ లో ఓ ఇల్లు తీసుకొని… హేమంత్, ఆ అమ్మాయి ఇద్దరు సహజీవనం చేశారు. విషయం సతీష్ తెలుసుకొని హేమంత్ కి వార్నింగ్ ఇచ్చాడు. తన స్నేహితురాలిని వదిలి పెట్టాలని ఇల్లు ఖాళీ చేయాలని సూచించాడు. ఆమెను హాస్టల్ కి పంపించాలని వార్నింగ్ ఇచ్చాడు. ఆమె తన ఎక్కడ దూరం అవుతుందో అని, భావించి కక్ష పెంచుకొని సతీష్ ను హేమంత్ హత్య చేశాడని పోలీసులు చెప్పారు.

28 తేదీన తన స్నేహితురాలిని బైక్ పై తీసుకొని హేమంత్.. హాస్టల్ లో వదిలి వచ్చినట్లు సీసీ కెమెరాల ఆధారాలు పోలీసులు గుర్తించారు. తరువాత మందు పార్టీ చేసుకుందామని సతీష్ ను నమ్మించాడనీ.. సతీష్ తో ఇంట్లో జరిగిన గొడవలోనే హేమంత్ అతడి తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడని పోలీసులు చెప్పారు. సతీష్ కనిపించకుండా పోయాడని.. అతడి స్నేహితులతోనే కొంత డ్రామా ఆడినట్టు చెప్పారు. అన్ని ఆధారాలు సేకరించి.. హేమంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Latest Updates