పవన్, క్రిష్ మూవీ..ఫస్ట్ లుక్ కేక

పవన్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా హోరెత్తుతుంది.ఓ వైపు పుట్టిన రోజు విషెస్ ,కొత్త సినిమా అప్ డేట్స్  తో ఎక్కడ చూసినా పవన్ కు సంబంధించిన న్యూస్ ట్రెండింగ్ లో ఉంటున్నాయి.  ఇవాళ మార్నింగ్ ఫ్యాన్స్ కు పవన్ బర్త్ డే గిఫ్ట్ గా వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది ఆ మూవీ టీం.ఇపుడు పవన్ 27వ మూవీకి సంబంధించిన మరో న్యూస్ వచ్చింది.

పవన్  ,డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్,ఏమ్ రత్నం కాంబినేషన్ లో పిరియాడిక్ డ్రామాగా వస్తున్న మూవీ  ఫస్ట్ లుక్ ను క్రిష్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పీఎస్ పీకే 27 మూవీ అని ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.ఫస్ట్ లుక్ లో పవన్ లుక్ ఓ రేంజ్ లో ఉంది. పవన్ ఫేస్ కనిపించకుండా ఎర్ర కండువాతో బ్లాక్ డ్రెస్ లో నడుముకు చేతి పట్టుకుని ఉన్నాడు.

ఈ సందర్బంగా 15 రోజుల మూవీ షూటింగ్ లో ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుందన్నారు క్రిష్. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుందన్నారు. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయమన్నారు.  ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ పవన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు క్రిష్. ఈ మూవీకీ ఎఎమ్ రత్నం నిర్మిస్తుండగా.ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Latest Updates