ఇస్లామాబాద్‌‌లో కృష్ణ మందిరం

10 కోట్లతో నిర్మాణానికి భూమిపూజ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో తొలి హిందూ టెంపుల్ నిర్మాణానికి మంగళవారం భూమిపూజ జరిగింది. . 20 వేల చదరపు అడుగుల్లో రూ.10 కోట్లతో కృష్ణుడి గుడి నిర్మాణం జరగనుంది. హ్యూమన్ రైట్స్ పార్లమెంటరీ సెక్రటరీ లాల్ చంద్ మల్హి మంగళవారం దీనికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947కు ముందు ఇస్లామాబాద్ లో ఆలయాలు ఉండేవన్నారు. గత 20 ఏళ్లుగా ఇస్లామాబాద్ లో హిందువుల జనాభా పెరుగుతోందని, వారికి ఆలయం ఉండాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates