చెన్నైకి తాగునీటిపై 22న కేఆర్‌ఎంబీ మీటింగ్‌

హైదరాబాద్‌, వెలుగు: చెన్నై సిటీకి తాగునీటి సరఫరాపై ఈ నెల 22న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం నిర్వహిస్తున్నట్టు మెంబర్‌ సెక్రటరీ హరికేశ్‌ మీనా రాష్ట్రా లకు లేఖ రాశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే ఈ మీటింగ్ లో అన్ని రాష్ట్రా ల ప్రతినిధులు పాల్గొనాలని కోరారు. ఎగువ రాష్ట్రాల నుంచి చెన్నైకి తాగునీటి కోసం విడుదల చేస్తున్న నీరు, ట్రాన్స్ మిషన్‌ నష్టాలపై మెకానిజం ఏర్పాటు, కండలేరు నుంచి చెన్నై వరకు నీటి సప్లైకి పైప్ లైన్ ఏర్పాటు, తమిళ నాడు పంపిన ఎజెండాలోని అంశాలు.. తాగునీటికి చెన్నైకి రిలీజ్ చేసిన నీళ్లను ఏపీ రైతులు సాగునీటి కి తరలించకుండా అడ్డుకోవడం, తదితర అంశాలపైన ఈ మీటింగ్ లో చర్చించనున్నారు.

Latest Updates