KTR బర్త్ డే : మొక్కలునాటి విషెస్ చెప్పిన తుమ్మల

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో మొక్కలు నాటి.. మంత్రి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, GHMC మేయర్ బొంతు రామ్మోహన్. ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున నాడు.. మొక్కలు నాటితే.. హరితహారం లక్ష్యం నెరవేరుతుందన్నారు మంత్రి తుమ్మల. ఈ విడత సిటీలో 40లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇప్పటికే 9లక్షల మొక్కల పంపిణీ పూర్తైందన్నారు మేయర్ బొంతు.

Posted in Uncategorized

Latest Updates