బీజేపీ చార్జిషీట్ పై మంత్రి కేటీఆర్ రియాక్షన్

బీజేపీ చార్జిషీట్ కు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. అసలు బీజీపీ ఎందుకు చార్జ్ షీట్ వేసిందన్నారు మంత్రి కేటీఆర్.దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రగతి నివేదిక విడుదల చేశామన్నారు. ఆరేళ్ల స్వల్ప వ్యవధిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. రైతు బంధును కేంద్రం కాపీ కొట్టిందన్నారు.రాబోయే రోజుల్లో హైదరబాద్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజా రవాణా, బస్తీ దవాఖానలు, రోడ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు

Latest Updates