16 మంది ఎంపీలను గెలిపిస్తే కాళేశ్వరంకు జాతీయ హోదా: కేటీఆర్

రాష్ట్రం నుంచి 16 మంది ఎంపీలు గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్..టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే మిషన్ కాకతీయ, భగీరథకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చుకోవచ్చని చెప్పారు. గత పాలకులు మిడ్ మానేరు ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. రైతుల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేరుస్తున్నారని..త్వరలోనే పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్.

Latest Updates