పోతిరెడ్డిపాడుపై వైఎస్ ను తప్పుబట్టిన కేటీఆర్ ..జగన్​ ప్లాన్​పై సైలెంట్

హైదరాబాద్‌, వెలుగుపోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌  గండితో తెలంగాణ ఎండిపోతుందని మంత్రి కేటీఆర్ అంగీకరించారు. ఆ తప్పంతా అప్పటి సీఎం వైఎస్​  రాజశేఖరరెడ్డిది, ఆయన హయాంలో కళ్లప్పగించి చూసిన కాంగ్రెస్​ పార్టీదేనని మండిపడ్డారు. అయితే, తెలంగాణకు అప్పటికంటే డబుల్​ నష్టం జరుగుతుంటే.. తమ సర్కారు ఏం చేస్తుందన్నది చెప్పకుంటనే కేటీఆర్​ విషయం దాటేయడం చర్చనీయాంశంగా మారింది. పోతిరెడ్డిపాడు తప్పంతా కాంగ్రెస్‌పైకి నెట్టిన కేటీఆర్.. ఇప్పుడు అంతకుమించి నష్టం కలిగేలా జగన్​ సర్కారు చేపడుతున్న ప్రాజెక్టును ప్రశ్నించలేదు. ప్రభుత్వపరంగా అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను జనానికి వివరించలేదు.

పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టింది కాంగ్రెస్​ హయాంలో కాదా, జీవో ఇచ్చింది కాంగ్రెస్​ కాదా? తెలంగాణ ప్రజలను రాబందుల్లా పీక్కుతిని, తెలంగాణను ఎండబెట్టి.. కృష్ణాను తరలించుకుపోతుంటే హారతులు పట్టింది కాంగ్రెస్​ కదా.. పోతిరెడ్డిపాడు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోంది. ఆనాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాల్వలు తవ్వుకుపోతుంటే కండ్లప్పగించి చూశారు. తెలంగాణకు చేయాల్సినంత నష్టం చేసి ఇప్పుడు కేసీఆర్‌పై విమర్శలు చేయడం సిగ్గు చేటు. పోతిరెడ్డిపాడుపై చేసిన తప్పులకు కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలె. లేకుంటే తెలంగాణ ప్రజలు క్షమించరు.

– మంగళవారం ఎల్లారెడ్డి మండలం బొప్పాపూర్‌ రైతు సభలో కేటీఆర్​

800 అడుగుల లెవెల్ నుంచి కృష్ణ నీళ్లు తోడుకుంటాం

 

Latest Updates