30 ఏళ్ల రాజకీయ చరిత్రలో కేటీఆర్‌‌ లాంటి డైనమిక్‌ లీడర్‌‌ను చూడలేదు: తలసాని

  •  ఫతేననగర్‌‌‌ ఫ్లైఓవర్‌‌, బ్రిడ్జి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్‌‌
  • కార్యక్రమంలో పాల్గొన్న తలసాని, ఇతర కార్పొరేటర్లు

హైదరాబాద్‌: సనత్ నగర్ లోని ఇండస్ట్రీస్ ప్రాంతంలో రైల్వే అండర్ బ్రిడ్జి, ఫతే నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, కార్పొరేట్లు పాల్గొన్నారు. 68 కోట్లతో రైల్వే అండర్ బ్రిడ్జి, రూ. 45 కోట్లతో ఫతేనగర్ ఫ్లై ఓవర్ నాలుగు లైన్‌ల రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు. రైల్వే అండర్‌‌ బ్రిడ్జి వల్ల షతేనగర్‌‌, సనత్‌నగర్‌‌ మెయిన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుందని మంత్రి కేటీఆర్‌‌ అన్నారు. ఏడాదిలోనే దీని నిర్మాణ పనులను పూర్తి చేస్తామని అన్నారు. సనత్ నగర్ నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతోందని, డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా ఇక్కడే ప్రారంభించించామని, ఇప్పుడు ఎన్నో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నామని కేటీఆర్‌‌ చెప్పారు. సనత్ నగర్ ప్రజలు అదృష్టవంతులని, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక పని పట్టుకుంటే అయిపోయేదకా వడలదని మంత్రిని పొగిడారు. బాలా నగర్ ఫ్లై ఓవర్ సెప్టెంబర్ కల్లా పూర్తవుతుంది అని చెప్పారు. కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నారని తలసాని అన్నారు. ‘నా ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత డైనమిక్ లీడర్ ను చూడలేదు’ అని చెప్పారు. కరోనా టైమ్‌లో కూడా ఎక్కడ అభివృద్ది ఆగలేదని అన్నారు. ఈ ఫ్లైఓవర్‌‌ నిర్మాణం కూడా మంత్రి కేటీఆర్ చొరవే అని చెప్పారు. కరోనా మినహా తెలంగాణ ప్రజలంతా సంతోషంగా వున్నారని చెప్పారు.

Latest Updates