అమరవీరుల కుటుంబాలకు కేటీఆర్ సాయం

పుల్వామ ఘటన తీవ్రంగా కలిచి వేసిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మన దేశాన్ని, ప్రజలను కాపాడే కర్తవ్యంలో వీరమరణం పొందిన వారికి టీఆర్ఎస్ పార్టీ తరుపున నివాళులు అర్పించారు. అమరుల కుటుంబాలకు తన వంతుగా 25 లక్షలు, తన స్నేహితుడి తరపున మరో 25 లక్షల రూపాయలు అందిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని CRPF  సదరన్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. పోలీసులను పేరుపేరునా పలకరించారు.

Latest Updates