TRS ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభం : KTR

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో కరీంనగర్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిటెండ్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం… బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీకి లాభం… కానీ టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభం జరుగుతుందని చెప్పారు కేటీఆర్. ఇక్కడ 16 మంది ఎంపీలను గెలిపిస్తే… ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల బలం 170కు పెరుగుతుందని అన్నారు. ఎర్ర కోటపైన ఎవరు జెండా ఎగురవేయాలో నిర్ణయించేది మనమే అని చెప్పారు.

గోదావరి జలాలను మనకు తేవడానికి చేస్తున్న భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్నారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మన సిరిసిల్ల ప్రాంతానికి 6 నెలల్లో లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారు.

కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలిచిన ఏడాదిలో ఈ ప్రాంతానికి రైల్ వస్తుందని చెప్పారు కేటీఆర్. జాతీయ రహదారులపై అనుమతులు వస్తున్నా కేంద్రప్రభుత్వం కొర్రీలు వేస్తోందన్నారు.

మే 1 నుంచి వృద్ధులకు, అర్హులందరికీ రూ.2000 పెన్షన్ వస్తుందని చెప్పారు కేటీఆర్.

Latest Updates