హరీష్ సర్ ఎక్కడ.. సిబ్బందితో కేటీఆర్

ktr-enquired-about-harish-rao-at-rajbhavan

రాజ్ భవన్ లో కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు.. కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్.. రాష్ట్ర మంత్రులు, శాసన సభాపతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా చాలామందే హాజరయ్యారు. ఓత్ టేకింగ్ సెర్మనీ అయ్యాక.. నాయకులు తిరుగు ప్రయాణమయ్యారు. సీఎం కేసీఆర్ తో పాటు.. కారులో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. బేగంపేట క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు. వెళ్తూ వెళ్తూ… సిబ్బందితో.. హరీష్ సార్ ఎక్కడ అని కేటీఆర్ అడిగారు. హరీష్ సార్ ను క్యాంప్ ఆఫీస్ కు రమ్మని చెప్పండి అని కేటీఆర్ తన సిబ్బందికి చెప్పారు. సిబ్బంది వెళ్లి విషయం హరీష్ రావుకు చెప్పారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్ తో పాటు.. హరీష్ రావు తన కారులో క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు.

ఈ సాయంత్రం మంత్రి వర్గ విస్తరణ ఉంది. కొత్తగా ఆరుగురు మంత్రులను కేబినెట్ లో చేర్చుకునే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హరీష్ రావు, కేటీఆర్, సబిత ఇంద్రారెడ్డితోపాటు.. ఎవరెవరికి బెర్తులు ఇస్తారు.. వారికి ఏ శాఖలు ఇస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ఇదే అంశంపై క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చర్చిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి.

Latest Updates