ఫన్నీ వీడియో పోస్ట్ చేసిన కేటీఆర్

నిత్యం సోషల్ మీడియాలో అప్డేటెడ్ పోస్టులు చేస్తూ ఫాలోవర్స్ కి అందుబాటులో ఉండటంతో ముందుటారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సాయం, పొలిటికల్ ఇలా ఎదైనా వెంటనే స్పందిస్తారు. ఇవే కాక..అప్పడప్పుడు నవ్విస్తారు కూడా. ఇవాళ కేటీఆర్ పోస్ట్ చేసిన ఓ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు. ఓ బోనులో మొబైల్ పడుసుకుంటాడు ఓ యువకుడు. ఫోన్ బయటికి తీయడానికి  కర్రతో ప్రయత్నిస్తుండగా..కర్ర కూడా బోనులో పడిపోతది. వెంటనే పక్కనే ఉన్న ఆ యువకుడి ఫ్రెండ్ ..ఎంతో సాహసం చేసి, బోనులోకి దిగుతాడు. కానీ ..అతడి తెచ్చింది మొబైల్ కాదు..కర్ర. దీంతో ఆ యువకుడు పరిస్థితి నవ్వాలో ..ఏడ్వాలో అన్నట్లు ఉంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన కేటీఆర్ ..అండ్ ద స్మార్ట్ గయ్ అవార్డ్ గోస్ టు..అంటూ ట్వీట్ చేయగా..సూపర్ ఫన్నీ వీడియో అంటూ పలువురు దీనికి రిప్లై ఇస్తున్నారు.

Latest Updates