ఎన్నికలప్పుడే రాజకీయం.. తర్వాత కలవాలి

దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు కేటీఆర్. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని లంబాడి తండాలో నిర్మించిన 126 డబుల్ బెడ్రూం ఇళ్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు కేటీఆర్.  సిటీలో 9 వేల 714 కోట్ల రూపాయలతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. లబ్ధిదారులు ఇళ్లను అమ్మినా, కిరాయికి ఇచ్చినా..పట్టాలు రద్దు చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు. ఎన్నికలప్పుడూ మాత్రమే రాజకీయాలని, తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి పని చేయాలన్నారు. అంతకుముందు దోమల్ గూడలో 9 కోట్ల 90 లక్షలతో నిర్మించనున్న వార్డు ఆఫీసుకు శంకుస్థాపన చేశారు. నారాయణ గూడలో 4 కోట్ల రూపాయలతో మోడల్ మార్కెట్ కు శంకుస్థాపన చేశారు.

 

Latest Updates