అద్భుత వ్యంగ్య చిత్రకారుడు శంకర్

పామర్తి శంకర్‌ రెండు దశాబ్దాలపాటు కార్టూనిస్టుగా నిలబడి, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకోవడం గొప్పవిషయమని టీఆర్‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌ అన్నారు. అద్భుతమైన వ్యంగ్య చిత్రకారుడిగా శంకర్ గుర్తింపు తెచ్చుకున్నారని, ఇలాంటి కళాకారుడు మన తెలంగాణ వ్యక్తి కావడం గొప్ప విషయమని చెప్పారు. శంకర్‌ గీసిన చిత్రాలతో ‘ది ఇంక్డ్ ఇమేజ్‌’ పేరిట శనివారం రవీంద్ర భారతిలోని ఐసీసీఆర్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌‌‌‌ను కేటీఆర్ ప్రారంభించారు. పొలిటికల్‌ కార్టూన్లు వేయడం కత్తి మీద సాము వంటిదని, ఒక్క కార్టున్‌‌‌‌తో ప్రభుత్వాల్లో అలజడి రేగుతుందని చెప్పారు.

ఉద్యమం సమయంలో తెలంగాణ ఆకాంక్షను తన కార్టూన్ల ద్వారా తెలియజేసి, రాష్ట్ర ఏర్పాటుకు అండగా ఉన్నందుకు కృతజ్ఞతాభినందనలు తెలిపారు. మీడియా కార్టూనిస్టులకు ప్రభుత్వం తరఫున పురస్కారాలు అందజేసే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని భాషా సాంస్కృతిక శాఖకు సూచించారు. శంకర్ తన కుంచెతో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారని అల్లం నారాయణ కొనియాడారు. తెలంగాణ బిడ్డ ప్రపంచస్థాయి కార్టూనిస్టుగా గుర్తింపు తెచ్చుకోవడం గర్వకారణమని మామిడి హరికృష్ణ అన్నారు. శంకర్‌ కార్టూన్ల బుక్‌‌‌‌ను కేటీఆర్‌ ఆవిష్కరించారు.

Latest Updates