తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే

కురవి, వెలుగు: రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్​ జిల్లా కురవి మండలం కందికొండ గుట్ట వద్ద కోటి రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గుట్ట వద్ద నిర్వహించిన సమావేశంలో రెడ్యానాయక్  మాట్లాడుతూ రాష్ట్రంలో కేటీఆర్​కు ఉన్న వ్యక్తిత్వం మరే నాయకుడికి లేదన్నారు. విదేశాల్లో చదివి విజన్ వున్న నాయకుడని కొనియాడారు.

Latest Updates