కేటీఆర్ కామిక్ బుక్స్ కాదు.. రాజ్యాంగం చదవాలె

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఖర్చు చేయలేని అసమర్థ ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కార్ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే గడుస్తోందన్నారు. శుక్రవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ రాష్ట్రానికి ఉదారంగా నిధులిచ్చి ఆదుకుంటే కృతజ్ఞత చూపించాల్సింది పోయి తిట్ల పురాణం అందుకోవడం విచారకరమని అన్నారు. ఈ ఆరేళ్లలో టీఆర్ఎస్ సర్కార్ సాధించిందేమిటని, కేంద్ర, రాష్ట్ర నిధులను ఎక్కడ, ఎంత ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలని కృష్ణ సాగర్ రావు డిమాండ్ చేశారు.

మంత్రి కేటీఆర్ ముందు కామిక్ బుక్స్ చదవడం ఆపి, కాన్ స్టిట్యూషన్ బుక్స్ చదవాలని సూచించారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలపై మంత్రి కేటీఆర్ ట్యూషన్ చెప్పించుకోవాలన్నారు. గడిచిన ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు, వివిధ పన్నులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, లోన్లు, గ్యారంటీలతో కలిపి రూ.3 లక్షల కోట్లు తెలంగాణకు కేంద్రం ఇచ్చిందని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates