కేసీఆర్ అంటే..కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు

కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ కు గోదావరి జలాలను విడుదల చేశారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. కే-  కాల్వలు, సీ- చెరువులు, ఆర్ -రిజర్వాయర్లు అని  చెప్పారు. కాల్వలు,చెరువులు, రిజర్వాయర్లతో కేసీఆర్ పేరు  సార్థకమైందన్నారు.  కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు గోదావరి జలాలను తరలించారన్నారు. సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తు ఉన్నమేడిగడ్డ నుంచి 618 మీటర్ల ఎత్తు ఉన్న కొండపోచమ్మకు గోదావరి జలాలను తరలించారన్నారు. ప్రపంచలోనే అత్యంత పెద్ద ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని తెలంగాణ మూడేళ్లలో పూర్తిచేసిందన్నారు.

Latest Updates