ఈ నెల 7న ఖమ్మంలో పర్యటించనున్నకేటీఆర్

ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఖరారయ్యింది.ఈ నెల 7న జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు.

కేటీఆర్ పర్యటన వివరాలు

 • ఖనాపురంలో  మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం.
 • బల్లెపల్లి అధునాతన వైకుంఠ ధామం ప్రారంభోత్సవం.
 • పండు రంగా పురంలో కోయచలక క్రాస్ బిటి రోడ్డు విస్తరణ పనులు, సెంట్రల్ డివైడర్, లైటింగ్ లైటింగ్ ప్రారంభోత్సవం(కోయచలక సర్కిల్ వద్ద).
 • రఘునాధపాలెంలో చింతగుర్తి బిటి రోడ్డు వెడల్పు ప్రారంభోత్సవం , రఘునాధపాలెం మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం.
 • NSP Canal Walk way ప్రారంభోత్సవం.
 •  కేఎంసీ పార్క్(పట్టణ ప్రకృతి వనం, 22వ డివిజన్) ప్రారంభోత్సవం.
 • లకారం ట్యాంక్ బండ్ సర్కిల్లో పీవీ నర్సింహారావు గారి విగ్రహం ఆవిష్కరణ.
 • దంసలాపురం ఆర్వోబీ ప్రారంభోత్సవం. అక్కడే ప్రో. జయశంకర్ సార్ విగ్రహం, సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ ఆవిష్కరణ.
 •  ప్రకాష్ నగర్ లో పోలీస్ కమిషనరేట్ నూతన భవనం ప్రారంభోత్సవం
 •  గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ(ఓపెన్ జిమ్, పార్క్) ప్రారంభోత్సవం- సుందరయ్య నగర్, ఖమ్మం
 •  ఐటీ హబ్ ప్రారంభోత్సవం(ఇల్లందు సర్కిల్). అనంతరం సభ

Latest Updates