వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడం మంచి పరిణామం: కేటీఆర్

హైదరాబాద్ లో  రీసెర్చ్  అండ్  డెవలప్ మెంట్  సెంటర్ కోసం…  వన్ ప్లస్ మొబైల్స్ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టడం మంచి పరిణామం అన్నారు కేటీఆర్. రానున్న రెండేళ్లలో  15 వందల మంది ఉద్యోగులు  ఇక్కడ పనిచేస్తారని తెలిపారు.  వన్ ప్లస్ మాన్యుఫాక్చరింగ్ సెంటర్ కూడా సిటీలో ఏర్పాటు చేయాలని కోరారు కేటీఆర్.  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో… వన్ ప్లస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ తో పాటు వన్ ప్లస్ సీఈవో పీట్ లూ హాజరయ్యారు.

Latest Updates