చిన్ననాటి ఐస్‌ గోలా తాతను కలిసిన కేటీఆర్‌

  • క్యాంపు ఆఫీసుకు పిలిపించి కుశల ప్రశ్నలు
  • స్కూల్‌ డేస్‌ను గుర్తు చేసుకున్న టీఆర్‌ఎస్‌ నేత
  • ఇల్లు, పెన్షన్‌ ఇప్పిస్తానని హామీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌ తో తనకున్న అనుబంధాన్ని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌. తాజాగా 30 ఏళ్ల కిందటి తన స్కూల్‌‌‌‌‌‌‌‌ డేస్‌‌‌‌‌‌‌‌ను గుర్తు చేసుకున్నారాయన. స్కూల్లో చదువుతున్నప్పుడు తనకు ఐస్‌‌‌‌‌‌‌‌గోలా అమ్మిన సయ్యద్‌ అలీని కలిశారు. వృద్ధాప్యంతో పని చేయలేని స్థితిలో ఉన్న అలీని ఆదుకుంటానన్నారు.

ఐస్‌ గోలాను మర్చిపోలేను

రెండు వారాల కిందట మహబూబ్ అలీ అనే వ్యక్తి అబిడ్స్‌‌‌‌‌‌‌‌ గ్రామర్‌‌‌‌‌‌‌‌ స్కూలు ముందు ఐస్‌‌‌‌‌‌‌‌గోలా అమ్మే చావూష్‌‌‌‌‌‌‌‌తో సెల్ఫీ దిగి ఆ ఫొటోను ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు ట్యాగ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ‘కే టీఆర్‌‌‌‌‌‌‌‌ సాబ్‌.. మీ స్కూల్ డేస్‌‌‌‌‌‌‌‌లో ఐస్‌‌‌‌‌‌‌‌ గోలా అమ్మిన వ్యక్తి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు’ అని ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. స్పందించిన కేటీఆర్‌‌‌‌‌‌‌‌.. ‘తప్పకుండా కలుస్తాను. చావూష్‌‌‌‌‌‌‌‌తో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి’ అని రీట్వీట్‌‌‌‌‌‌‌‌ చేశారు. చెప్పినట్టే గురువారం బేగంపేట క్యాంపు కార్యాలయానికి చావూష్‌‌‌‌‌‌‌‌ను పిలిపించారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని మాట్లాడారు. ‘చావూష్‌‌‌‌‌‌‌‌ ఐస్‌‌‌‌‌‌‌‌గోలా ఎప్పటికీ మర్చిపోలేను. అబిడ్స్‌‌‌‌‌‌‌‌ గ్రామర్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ ముందు లంచ్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌లో వెళ్లి కొనుక్కునేవాడిని. ఐస్‌‌‌‌‌‌‌‌ను సన్నగా పొడిలా తురిమి దానిపై కొంచెం ఫ్లేవర్‌‌‌‌‌‌‌‌, కొంచెం కలర్‌‌‌‌‌‌‌‌, కొంచెం కోవా కలిపి ఇచ్చే
గోలా టేస్ట్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికీ మర్చిపోలేను’ అని తన స్కూల్‌‌‌‌‌‌‌‌ డేస్‌‌‌‌‌‌‌‌ను గుర్తు చేసుకున్నారు. ‘చావుష్‌‌‌‌‌‌‌‌ తాతా.. ఇప్పటికీ ఐస్‌‌‌‌‌‌‌‌ గోలా అమ్ముతున్నావా, ఎలా ఉన్నావ్‌ , ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు ఏం చేస్తున్నారు’ అని అడిగారు.

కలుస్తానని అనుకోలేదు: సయ్యద్‌‌‌‌‌‌‌‌

ఏడాది క్రితం హార్ట్‌‌‌‌‌‌‌‌ సర్జరీ అయిందని, ఆరోగ్యం సహకరించకున్నా గోలాలు అమ్మక తప్పడంలేదని
కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు సయ్యద్‌ అలీ చెప్పారు. ఇల్లు కూడా లేదని చెప్పడంతో చలించిన కేటీఆర్‌‌‌‌‌‌‌‌.. వెంటనే మంజూరు చేయిస్తానని, పెన్షన్‌ ఇప్పిస్తానన్నారు. అతడి కొడుకులకు ఉపాధి చూపిస్తానని మాటిచ్చారు. అధికారులతో అక్కడి నుంచే ఫోన్‌లో మాట్లాడారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌ మంచితనం గురించి విన్నానని, ఆయన్ను కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు అలీ. తన బాధలు విని
సాయం చేస్తానన్న కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Latest Updates