కేటీఆర్ నమస్తే.. హరీశ్ షేక్ హ్యాండ్..

సభ్యులకు కేటీఆర్‌‌‌‌ నమస్కారం

షేక్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ ఇచ్చిన హరీశ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: మామూలుగానైతే అసెంబ్లీ సమావేశాలప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేతులు కలుపుకొని పలకరించుకుంటరు. ఆప్యాయంగా హగ్‌‌‌‌ చేసుకుంటరు. కానీ కరోనా భయంతో ఈసారి పద్ధతి మారింది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు మొదలైనయి కదా. అసెంబ్లీ లాబీల్లో, బయట ఎదురుపడినోళ్లకు నమస్కారం పెట్టే నేతలు పలకరించారు. కొందరు నేతలు మంత్రి కేటీఆర్‌‌‌‌ను సభలో, బయట కలిసి విష్‌‌‌‌ చేస్తే ఆయన నమస్కారంతో సరిపెట్టారు. ఆర్థిక మంత్రి హరీశ్‌‌‌‌రావు మాత్రం విష్ చేసినోళ్లందరికీ షేక్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ ఇచ్చారు. ‘అదేంది సార్‌‌‌‌.. షేక్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ ఇస్తున్నారు?’ అని ఓ మీడియా ప్రతినిధి అడిగితే ‘బతికినన్ని రోజులు బతుకుతం. అలవాటు మార్చుకుంటమా’ అని బదులిచ్చారు.

For More News..

అసెంబ్లీలో కాంగ్రెస్ వ్యూహం.. ఒక్కొక్కరూ ఒక్కొక్క అంశంపై..

‘మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు.. ఎన్నికల్లో కోట్లు సంపాదించాడు’

ఈసారి బడ్జెట్ ​1.55 లక్షల కోట్లు!

Latest Updates