మంత్రి కేటీఆర్ కు కుదరట్లేదు

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్ఠాత్మక సినిమా సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్- ప్రి రిలీజ్ ఈవెంట్ ను మూవీ మేకర్స్ భారీగా ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 18వ తేదీన ఎల్బీ స్టేడియంలో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నామని సోషల్ మీడియాలో ప్రకటించారు. దీనికి రాష్ట్రమంత్రి కేటీఆర్, పవన్ కల్యాణ్, ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, వివి వినాయక్  లాంటి రాజకీయ, సినీ దిగ్గజాలు వస్తారని చెప్పారు. ఐతే… మంత్రి కేటీఆర్ ఆరోజు రావడం లేదని ఆ తర్వాత సవరణ ప్రకటన చేసింది మూవీ ప్రొడక్షన్ కంపెనీ.

మంత్రి కేటీఆర్ కు ముందస్తుగా ఉన్న అపాయింట్ మెంట్స్ వల్ల 18వ తేదీన సైరా నరసింహారెడ్డి ప్రి- రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోతున్నారని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ తెలిపింది. ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పారు మెగా అభిమానులు.

Latest Updates