ఇంటర్ బోర్డులో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు : కేటీఆర్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ట్విట్టర్ లో కాసేపు నెటిజన్లతో చిట్ చాట్ చేశారు. రాజకీయాలు, ఇంటర్ బోర్డు వైఫల్యం, వ్యక్తిగత జీవితంపై.. నెటిజన్లు ప్రశ్నలకు.. కేటీఆర్ సమధానాలు ఇచ్చారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవలపై మీ స్పందేనేంటని ఓ నెటిజన్ అడిగారు. దానికి స్పందించిన కేటీఆర్.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ప్రకారం.. తప్పు చేసిన వారిపై కఠినచర్యలుంటాయన్నారు. గ్లోబరీనా వివాదంలోనూ మీపేరు వినిపిస్తుంది? దీనిపై మీరేం చెప్పదలచుకున్నారన్న ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ఇంటర్ ఫలితాల వెల్లడిలో అవకతవకలు జరిగాయని తెలిసే వరకు.. తనకు గ్లోబరీనా అంటే ఏంటో తెలియదన్నారు కేటీఆర్. ఇంటర్ బోర్డు విషయంలో.. కొంచెం క్లారిటీ ఇవ్వాలని అడగ్గా.. జరిగిన ఘటనలతో తను కూడా బాధపడుతున్నానని చెప్పారు కేటీఆర్. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోగలనని చెప్పారు. అవకతవకలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు కేటీఆర్.

మున్సిపల్ ఆఫీసుల్లో లంచాలు అరికట్టేందుకు.. త్వరలోనే కొత్త మున్సిపల్ చట్టం తెచ్చి సమస్యను పరిష్కించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమా చూశారా అని అడగ్గా.. ఆ సినిమాల గురించి తనకేమీ తెలియదన్నారు. ఏపీలో ఎవరు గెలుస్తారని ఓ నెటిజన్ అడిగితే.. తనకు ఏపీ పాలిటిక్స్ పై ఆసక్తి లేదన్నారు కేటీఆర్. కేఏ పాల్ గురించి ఒక్క మాట చెప్పమంటే.. ఆయన ప్రచారం చాలా వినోదాత్మకంగా ఉంటుందన్నారు. జగన్ సీఎం పదవికి అర్హుడనిపిస్తోందా అన్న ప్రశ్నకు.. అది ఏపీ ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. మోడీ అక్షయ్ ఇంటర్వ్యూపై మీ అభిప్రాయమేంటని ఓ నెటిజన్ అడిగాడు. తాను ఇంటర్వ్యూ చూడలేదన్న కేటీఆర్.. అక్షయ్ వేసుకున్న పింక్ ప్యాంట్ నచ్చిందని సమాధానమిచ్చారు.

Latest Updates