దేశ పట్టణీకరణ సగటు 31 శాతం..తెలంగాణది 42

పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. దేశ సగటు కంటే మన పట్టణ జనాభా మెరుగ్గా ఉందన్నారు. దేశ పట్టణీకరణ సగటు 31.2 శాతం అయితే తెలంగాణ పట్టణీకరణ సగటు 42.6 శాతం అని అన్నారు. అసెంబ్లీలో పట్టణాల అభివృద్ధిపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్. ఇంటి నిర్మాణ పనులకు  సులువుగా అనుమతి లభిస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఆస్తిపన్ను, నీటిపన్ను పైసా పెంచలేదన్నారు. గత పొరపాట్ల సవరణకే ఎల్ఆర్ఎస్ స్కీం తెచ్చామన్నారు. విపత్తుల నిర్వహణకే డీఆర్ఎఫ్ అని..డీఆర్ఎఫ్ ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణనే అని అన్నారు.

మెట్రోతో హైదరబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు. ఇప్పటికే 69 కిలోమీటర్ల మెట్రో మార్గం పూర్తిచేశామన్నారు. 198 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. 35 వేల మందికి రూ. 5కే మధ్యాహ్న భోజనం పెట్టామన్నారు. అన్నపూర్ణ పథకం ద్వారా 5కోట్ల 58 లక్షల మందికి భోజనం అందించామన్నారు. త్వరలోనే హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు ఓపెన్ చేస్తామన్నారు.

హైదరాబాద్ కార్పోరేషన్ కు కేంద్రం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నారు మంత్రి కేటీఆర్.  ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆస్తిపన్ను,నీటిపన్ను పెంచలేదన్నారు.  అక్టోబర్ 2 వరకు దేశంలో ఎక్కడ లేని విధంగా 11 వేల పబ్లిక్ టాయిలెట్స్  పూర్తి చేస్తామన్నారు. మున్సిపాలిటీల్లో త్వరలోనే ఆఫీసర్ నియామకాలు చేపడతామన్నారు.

Latest Updates