హుజూర్ నగర్ రుణం తీర్చుకునే బాద్యత సైదిరెడ్డిది

  • ఉప ఎన్నిక గెలుపుతో అహంకారం వద్దు
  • టీఆర్ఎస్ కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ సూచన
  • ఉప ఎన్నిక రద్దుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపణ
  • కోటి ఆశలతో ప్రజలు సైదిరెడ్డిని గెలిపించారు
  • మునిసిపల్ ఎన్నికల్ని ఆషామాషీగా తీసుకోవద్దు: మంత్రి

హుజూర్ నగర్ ఉప ఎన్నికతో చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నో అనుకోని అవాంతరాలు వచ్చినా విజయం సాధించామని, సైదిరైడ్డి సైదిరెడ్డి టిఆర్ఎస్ 104వ ఎమ్మెల్యే అని చెప్పారాయన. హుజూర్ నగర్ ముఖ్య కార్యకర్తలు, నేతలతో ఆయన ఇవాళ సమావేశమయ్యారు. తన రోడ్ షో జరిగిన నాడే ఉప ఎన్నికలో గెలుపు ఖాయమని తేలిపోయిందని అన్నారు కేటీఆర్. ఆ ఎలక్షన్ ను రద్దు చేయించాలని బీజేపీ ప్రయత్నించిందని, ఆ పార్టీ 104వ స్థానంలో కూడా డిపాజిట్ కోల్పోయిందని అన్నారు.

పంచాయతీలొద్దు

హుజూర్ నగర్లో పీసీసీ అధ్యక్షుడి సొంత సీటును గెలుచుకొన్నామని, ఇది మాములు గెలుపు కాదని అన్నారు కేటీఆర్. ఈ విజయాన్ని చూసి అహంకారం, మిడిసిపాటు వద్దని కార్యకర్తలకు సూచించారాయన. లేనిపోని పంచాయతీలకు దిగొద్దని హెచ్చరించారు. కోటి ఆశలతో హుజూర్ నగర్ ప్రజలు టీఆర్ఎస్ ని గెలిపించారని, వారి రుణం తీర్చుకునే బాధ్యత సిదిరెడ్డిదని అన్నారు కేటీఆర్.

మునిసిపల్ ఎన్నికల్లో జాగ్రత్త

మునిసిపల్ ఎన్నికలు ఈ నెలలోనే రావచ్చని లేదంటే కొంత ఆలస్యమైతే వచ్చే నెలలో జరుగుతాయని చెప్పారు మంత్రి కేటీఆర్. ఆ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. మునిసిపల్ ఎన్నికలు వైవిధ్యంగా, భిన్నంగా ఉంటాయని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎగిరెగిరి పడుతున్న వారికి ఎన్నికల్లో గెలుపే సమాదానమని, ప్రతిపక్ష నేతలు బజారు భాష మాట్లాడావాల్సిన అవసరం లేదని చెప్పారాయన.

Latest Updates