యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో KTR తీర్మానం

నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు మంత్రి కేటీఆర్. సభంతా తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్ర తన నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని కోరారు కేటీఆర్. ఒకవేళ తవ్వకాలకు ప్రయత్నించినా కలిసికట్టుగా అడ్డుకుందామన్నారు. ఇప్పటికే పలు ప్రజా సంఘాలు, రాష్ట్ర యువత యురేనియం తవ్వకాలకు గళమెత్తింది. ఇందుకు స్పంధించిన కేటీఆర్ రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని, తవ్వకాలకు వ్యతిరేకంగా తాము స్తాండ్ తీసుకోనున్నామని తెలిపారు. చెప్పిన విధంగానే ఈ రోజు అసెంబ్లీలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మాణం ప్రవేశపెట్టారు.

Latest Updates