నేను బాగానే ఉన్నా..నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు

మీడియాలో తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు. హార్స్ రైడింగ్ చేస్తుండగా  హిమాన్షు రావు కాలికి తీవ్రగాయమైందని, కనీసం నిల్చోలేకపోతున్నాడని ఈ రోజు ఉదయం సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అతడు సోమాజిగూడ ఆస్పత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారని కథనాలు వెలువడ్డాయి.వాటిపై హిమాన్షు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘’ప్లీజ్‌.. అలాంటి సిల్లీ న్యూస్‌ నమ్మొద్దు. నా కాలికి ఫ్రాక్చర్ అయినట్లు ప్రచారం జరిగింది.నాకేమీ కాలేదు… కండరం కొద్దిగా నలిగింది. నేను ఇప్పుడు బాగానే నడవగలుతున్నాను. రేపటి నుంచి రన్నింగ్ మొదలు పెడతాను. నా ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాసే సాహసం చేయకండి అంటూ ట్వీట్ చేశాడు.

Latest Updates