విపత్తు నివారణ వాహనాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

​గ్రేటర్ హైదరాబాద్‌లో విపత్తులు సంభవించినప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 8 వాహనాలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. విపత్తుల నివారణకై ప్రత్యేకంగా రూపొందించిన ఎనిమిది వాహనాల్లో.. ఒక్కొక్కదానిలో ఆరు ప్రత్యేక పరికరాలు కలిగిన బాక్సులు, జనరేటర్, ఆక్సిజన్ సిలిండర్లు తదితర పరికరాలు ఉన్నాయి. వాహనాల పనితీరును, పరికరాల ఉపయోగాన్ని మంత్రి కేటీఆర్‌కు అధికారులు వివరించారు.

Latest Updates