23 నుంచి కోటి బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఈ నెల 23 నుంచి కోటీ చీరలను పంపిణీ చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఈ సారి బతుకమ్మ చీరలు 10 రకాల డిజైన్ లు , 10 రకాల కలర్లతో కోటి చీరలు తయారు చేయించామన్నారు. కొన్ని సలహాలు సూచనలు తీసుకొని 10 లక్షల చీరలు 9 మీటర్లు.. మిగతా 90 లక్షలు చీరలు 6 మీటర్ల సైజులో తయారు చేయించామన్నారు. మసాబ్ ట్యాంక్ CDMA ( కమిషనర్ & డైరెక్టర్ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ ) కార్యాలయంలో బతుకమ్మ చీరల ప్రదర్శనలో  మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన  ఈ నెల 23 నుంచి కోటి చీరలు పంపిణీ ప్రక్రియ మొదలవుతుందన్నారు.   బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం రూ.313 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 16 వేల మంది నేతన్నలు , 26 వేల మగ్గాలకు ఉపాధి కల్పించామన్నారు.  ఇంతకు ముందు  నెలకు 7 నుండి 12 వేల వరకు సంపాదించే నేతన్నలు ఇప్పుడు 16 నుండి 20 వేల వరకు సంపాదిస్తున్నారని అన్నారు కేటీఆర్.

Latest Updates