మళ్లీ గెలిపిస్తే మొన్నటి లాగా వరదలు రాకుండా నాలాల పునరుద్ధరణ చేస్తాం

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభివృద్ధి చూపించి ఓట్లు అడుగుతున్నామన్నారు మంత్రి కేటీఆర్. జలవిహార్ లో జరిగిన గౌడ సంఘం… ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్.. మళ్లీ గెలిపిస్తే మొన్నటి లాగా వరదలు రాకుండా నాలాల పునరుద్ధరణ చేస్తామన్నారు.  ఈ ఎన్నికల్లో ఒక్క TRS పార్టీని ఎదుర్కోలేక… 12 మంది మంత్రులు వచ్చారన్న కేటీఆర్.. ఐదేళ్లలో చేసిన అభివృద్దిని చూసే ఓటేయండన్నారు. ఇదేండ్ల కింద ఇళ్లకు, పరిశ్రలకు, వ్యవసాయానికి కరెంట్ సరిగ్గా ఉండకపోయేదని.. మంచి నీళ్ళ కష్టాలు ఉండేవన్నారు. కానీ పరిస్థితిని మార్చేశామని.. 24 గంటల పాటు విద్యుత్తు, ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామన్నారు. గండిపేటకు రెండింతలతో కేశవపూర్ లో చెరువుని నిర్మిస్తున్నామని తెలిపారు. నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందిస్తామన్నారు.

కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్, ఎల్.ఈ.డీ. లైట్స్, 5 లక్షల సీసీ కెమేరాలతో సెక్యురిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.  కానీ బీజేపీ వాళ్ళు ఫైన్స్ తీసేస్తామంటున్నారని..  బాబర్, బిన్ లాడెన్ అంటూ ఓట్లు అడుగుతున్నారన్నారు. హిందు-ముస్లిం అంటూ ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు మాత్రమే చెప్తున్నారని.. మనం అరేళ్లలో కేంద్రానికి 2 లక్షల 72 వేల  కోట్లు కడితే… మనకు కేంద్ర ఒక లక్ష 40 వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. వరుసగా కేంద్ర మంత్రులని దింపుతున్నారని.. ఖాళీగా ఉన్న ట్రంప్ ని కూడా పట్టుకొస్తారట అన్నారు. వరదలొస్తే ప్రతిపక్ష లీడర్లు ఒక్కరూ రాలేదని.. మేము తిరిగినాము. ప్రజలకి భరోసా కల్పించామన్నారు. భాదితులకు బీజేపీ వాళ్ళు 25 వేలు ఇస్తా అంటే… కాంగ్రెస్ వాళ్లు 50 వేలు ఇస్తామంటున్నారు. ఎక్కడి నుంచి ఇస్తారో ఏమో మరి అన్నారు మంత్రి కేటీఆర్.

Latest Updates