బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్ నగర ప్రజలకు మరో  ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. బయోడైవర్సిటీ జంక్షన్‌లో మెహిదీపట్నం నుంచి ఖాజాగూడ రహదారిలో నిర్మించిన రెండో స్థాయి ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 69.47 కోట్ల వ్యయంతో 900 మీటర్ల వరకు మూడు లైన్లుగా దీనిని నిర్మించారు. ఫ్లై ఓవర్ ప్రారంభంతో బయోడైవర్సిటీ జంక్షన్లో వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. ఐటీ జోన్ లో ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. మెహిదీపట్నం హైటెక్ సిటీ దారిలో ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభంతో ఖాజాగూడ నుంచి మైండ్‌స్సేస్ వైపు వెళ్లే ట్రాఫిక్‌కు ఎంతో వెసులుబాటు కలుగుతుంది. ఈ మార్గంలో ప్రస్తుతం గంటకు 14 వేలకుపైగా వాహనాలు నడుస్తుండగా, 2035 వరకు వీటి సంఖ్య రెట్టింపవుతుందని అంచనావేసి దీని నిర్మాణం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Latest Updates