ఎక్స్ అఫీషియో సభ్యుల కేటాయింపుపై నేడు కేటీఆర్ భేటీ

హైదరాబాద్, వెలుగు:

పూర్తిస్థాయి మెజార్టీ రాని కార్పొరేషన్, మున్సిపాలిటీలో మేయర్, చైర్ పర్సన్  పదవి దక్కించుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. తక్కువ సీట్లు వచ్చిన చోటపార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలను అక్కడికి ఎక్స్ అఫీషియో మెంబర్ గా పంపనుంది. వారి ఓట్లు ఆయా ప్రాంతాల్లో కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు ఎక్కడ ఎక్స్​ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవాలన్న దానిపై పార్టీలోని ఎంపీలు, ఎమ్మెల్సీలతో టీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  శనివారం తెలంగాణ భవన్ లో భేటీ కానున్నారు.  ఎక్స్ అఫీషియో మెంబర్​గా ఏ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారో అధికారులకు శనివారం సాయంత్రంలోగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సమాచారం ఇవ్వాల్సి ఉంది.

మెజార్టీ టీఆర్ఎస్ వాళ్లే

రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలు,10 కార్పొరేషన్ లో అత్యధికంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే  ఎక్స్​ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సంఖ్యను కలుపుకుని మొత్తం153 మంది ఎక్స్ ఆఫీషియో మెంబర్లు ఆ పార్టీకి ఉన్నారు. ఇందులో 105 మంది ఎమ్మెల్యేలు, 33 మంది ఎమ్మెల్సీలు, 9 మంది లోక్‌ సభసభ్యులు,  ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు.

Latest Updates