అభినందన్‌ కు నా సెల్యూట్‌ : కేటీఆర్

హైదరాబాద్ : భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ బుధవారం పాకిస్థాన్‌ చేతికి చిక్కగా.. ఆయనకు సంబంధించిన కొన్ని వీడియోలను పాక్ విడుదల చేసింది. ఆ వీడియోల్లో ఆయన చాలా మనో నిబ్బరంతో కనిపిస్తున్నారు. ఏమాత్రం తొణక్కుండా పాక్ అధికారులకు సమాధానమిస్తున్న ఆయన ధైర్య సాహసాలను ఇండియా మొత్తం అభినందిస్తోంది.

అభినందన్ క్షేమంగా ఇండియాకు రావాలంటూ పూజలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అతడిపై పోస్టులు పెడుతూ దేశ భక్తిని చాటుతున్నారు. TRS వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌.. అభినందన్ విషయంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు.

‘దేశంలో స్వార్థ రాజకీయాలు, టీఆర్పీ రేటింగ్స్‌లో మీడియాలో యుద్ధాలు జరుగుతుంటే.. గాయాలపాలై ప్రత్యర్థికి చిక్కిన ఇండియన్‌ పైలట్‌ అభినందన్‌ ధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ఉంటూ.. దేశ రహస్యాలు వెల్లడించేందుకు నిరాకరించారు. విపత్కర పరిస్థితుల్లోనూ గొప్ప ధైర్యసాహసాలను, హుందాతనాన్ని ప్రదర్శించిన అభినందన్‌ కు నా సెల్యూట్‌’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అభినందన్‌ నా హీరో.. అతన్ని స్వదేశం తీసుకురండి అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ లు పెట్టారు.

Latest Updates