ప్రశ్నలతో రెడీగా ఉండండి.. రేపు సాయంత్రం ఐదింటికి కేటీఆర్ లైవ్

హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్.. రేపు ట్విట్టర్ వేదికగా చిట్ చాట్ చేయనున్నారు. గురువారం (అక్టోబర్-4)న సాయంత్రం 5 గంటల నుంచి ట్విట్టర్ లో అందుబాటులో ఉంటానని తెలిపారు కేటీఆర్. ఈ సందర్భంగా ఓ ఫొటోను పోస్ట్ చేశారు. మీ ప్రశ్నలను #askKTR అనే ట్యాగ్ తో ట్వీట్ చేయాలని సూచించారు మంత్రి కేటీఆర్.

కేటీఆర్ ట్విట్టర్ కు మంచి రెస్పాన్స్

కేటీఆర్ ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు పోస్టింగ్ లతో చురుగ్గా ఉంటారు. తన పరిధిలోని శాఖలకు సంబంధించిన సమాచారం తెలియజెప్పడమే కాకుండా.. ఇతర శాఖల్లోని ఆసక్తికరమైన అంశాలను ఫాలోవర్స్ తో పంచుకుంటారు. ప్రభుత్వ పథకాల గురించి వివరించడం, సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం, తన పరిధి కాకపోతే వాటిని ఇతరులకు చేరవేయడం చేస్తుంటారు. ఆపదలో ఉన్నవారు సాయం కోసం ట్వీట్ చేస్తే… తన టీమ్ ఆ పని చూసుకుంటుందని.. వెంటనే ఆదేశాలిస్తారు.  ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆన్‌ లైన్లోనే కేటీఆర్ ఆఫీస్ పేరుతో ఒక ట్విట్టర్ హ్యాండిల్‌ ను ఏర్పాటుచేశారు.

Posted in Uncategorized

Latest Updates