100 ఏళ్లు నిలబడే సత్తా ఉన్న పార్టీ టీఆర్ఎస్

వంద సంవత్సరాలు నిలబడే విధంగా స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి 60 లక్షల మంది టిఆర్ఎస్ కార్యకర్తలకు ప్రమాధ భీమా ప్రీమియం చెక్ (రూ.16.11కోట్లు ) ను అందజేశారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వేరే పార్టీలకు ఎన్నో అజెండాలు వుండొచ్చు.. కానీ టీఆర్ఎస్ కు ఒకటే రాష్ట్రం..ఒకటే అజెండా అని అన్నారు. కార్యకర్తల ఇన్సూరెన్స్ కోసం మూడేళ్లలో రూ.45 కోట్ల ప్రీమియం చెల్లించామన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఇంకా కొత్త పథకాలు కూడా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు.

భారత దేశంలో ఏ పార్టీకి లేని యంత్రాంగం టీఆర్ఎస్ కు ఉందన్నారు. జాతీయ పార్టీలతో పోటీ పడి నిలదొక్కుకోవడం అజేయమన్నారు. జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం 90 శాతం పూర్తి అయ్యిందన్నారు. కరోనా సంక్షోభంలో కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలన్నారు. తన బర్త్ డే సందర్భంగా వ్యక్తిగతంగా తనను కలిసిన ఎమ్మెల్యేలు వంద అంబులెన్స్ లు ఇస్తున్నామన్నారు. టీపీసీసీ, టిబిజెపి నేతలు మాట్లాడే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలన్నారు. మీ పార్టీలకు పేరుకు ముందు టీ అని ఉందంటే అది టీఆర్ఎస్ పుణ్యమేనన్నారు. రెండు పార్టీల నేతలు సీఎం కేసీఆర్ పైన జాగ్రత్తగా మాట్లాడితే మంచిదన్నారు కేటీఆర్.

see more news

దేశంలో ఒక్కరోజే 57 వేల కరోనా కేసులు

యువతలో కరోనా ముప్పు ఎక్కువే!

Latest Updates